Narsapuram: నర్సాపురంలో ఘనంగా ప్రపంచ గురు పూజోత్సవం!
Narsapuram: నర్సాపురంలో ఏపీజేఎంఏ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొని గురువులను సత్కరించారు.
Narsapuram: నర్సాపురంలో ఘనంగా ప్రపంచ గురు పూజోత్సవం!
Narsapuram: ఆంధ్రప్రదేశ్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జూనియర్ కళాశాల యాజమాన్యం, కళాశాలల అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ పాల్గొని సంఘ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ సమాజం ఉన్నతంగా ఉందన్నా, నేడు ప్రపంచంలో ఎందరో వైద్యులు, శాస్త్రవేత్తలు అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారంటే అది కేవలం గురువుల ఆశీర్వాదాలు అని కొనియాడారు. జీవితంలో సరైన మార్గనిర్దేశం చేసే ఉపాధ్యాయులు దొరకడం విద్యార్థులకు దక్కిన వరం అని పేర్కొంటూ గురువుల సేవలను గుర్తించి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన APJMA నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు ఉన్నత విద్య ను అందిస్తూ కళాశాల లకు ర్యాంకులు కురిపిస్తున్న అధ్యాపకులకు ఎంత చేసినా తక్కువే అని సంఘ సభ్యులు అన్నారు.
వివిధ కళాశాలకు చెందిన అధ్యాపకులను సత్కరించి జ్ఞాపికలు అందజేసి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంను ఇంత ఘనంగా నిర్వహించిన సూర్య కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ కు సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




