Tanuku: తణుకు ఆసుపత్రిలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
Tanuku: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. ఉచిత వైద్య సేవలపై సూపరింటెండెంట్ వివరించారు.
Tanuku: తణుకు ఆసుపత్రిలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
Tanuku: మానసిక సమస్యలతో బాధపడేవారు ఉచిత మానసిక ఆరోగ్య సలహా,వైద్యం కోసం తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిని సంప్రదించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. సాయి కిరణ్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శనివారం ర్యాలీతో పాటు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మానసిక అనారోగ్యంపై ఉన్న అపోహలను తొలగించడం, మానసిక సమస్యలను తొలిదశలో గుర్తించడం, సకాలంలో వైద్య సహాయం పొందడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ థీమ్ “అనుభవాలను ఆలకిద్దాం – నిజమైన స్వరాలు, నిజమైన మార్పు” అనే సందేశంతో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, మానసిక సమస్యలతో బాధపడేవారికి సహకారం అందించడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని డాక్టర్ సాయికిరణ్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్.ఎం.ఓ డా. ఎల్. సాయి బాలాజీ డా.ప్రభవతి, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.




