Achanta: తాగునీటి కోసం వంకతాళ్లచెరువు గ్రామస్తుల ఆందోళన.. స్పందించిన ఎంపీడీవో
Achanta: ఆచంట మండలం వంకతాళ్లచెరువులో తాగునీరు రాక ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన చేపట్టగా, వెంటనే కుళాయిల ద్వారా నీరు సరఫరా చేయాలని ఎంపీడీవో ఆదేశించారు.
Achanta: తాగునీటి కోసం వంకతాళ్లచెరువు గ్రామస్తుల ఆందోళన.. స్పందించిన ఎంపీడీవో
ఆచంట: ఆచంట మండలం వంక తాళ్లచెరువు గ్రామానికి త్రాగునీరు సరఫరా లేదని మంగళవారం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మామిడి శెట్టి రామాంజనేయులు త్రాగు నీటి సమస్యపై స్పందించి రెండు రోజులుగా త్రాగునీరు గ్రామంలో సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి కృష్ణమోహన్ కు ఫిర్యాదు చేశారు.
అంతేకాక ఇటీవల అర్నబ్ తుఫాను ప్రభావం వల్ల వాడకం కోసం కాలువలో నీరు కూడా మలినంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఎంపీడీవో స్పందించి పంచాయతీ అధికారులతో మాట్లాడి తక్షణం కుళాయిల ద్వారా నీరు సరఫరా అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కేత వెంకటలక్ష్మి కట్టా సత్యవతి కోళ్ల మంగమ్మ గెద్దాడ లక్ష్మి బండి నాగమణి కుడుపూడి కుమారి కడలి నాగమణి చింతపల్లి సత్యవతి కేత సత్యవతి కేత పుల్లారావు పాల్గొన్నారు.




