Penumantra: జడ్పీలో ప్రజల గొంతుకవుతా: కేతా గోపాలన్

Penumantra: పెనుమంట్ర మండల జడ్పీటీసీ సీపీఎం అభ్యర్థి కేతా గోపాలన్ బట్లమగుటూరు, మార్టేరు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి మద్దతు కోరారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 30 Oct 2026 8:15 PM IST
Penumantra
X

Penumantra: జడ్పీలో ప్రజల గొంతుకవుతా: కేతా గోపాలన్

పెనుమంట్ర: పెనుమంట్ర మండల ప్రజల సమస్యలను వినిపించేందుకు జిల్లా పరిషత్ లో ప్రజల గొంతుక అవుతానని కేతా గోపాలన్ అన్నారు. శుక్రవారం సిపిఎం పెనుమంట్ర జడ్పిటిసి అభ్యర్థి కేతా గోపాలన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బట్లమగుటూరు మార్టేరు గ్రామాలలో ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ కాలనీల సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు దళితుల స్మశాన సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. చిన్న సన్నకారు కౌలు రైతులు రుణాలు సమస్య కూడా తీవ్రంగా ఉందని అన్నారు.

త్రాగునీరు డంపింగ్ యార్డులు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. సిపిఎం పర్యటనలు పాదయాత్రల ద్వారా ప్రజలను కలుసుకొని సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టేందుకు అనేక సందర్భాల్లో కృషి చేసిందని అన్నారు. స్థానిక సంస్థలలో ప్రజల గొంతు వినిపించేందుకు కృషి చేస్తానని అన్నారు.

సిపిఎం జిల్లా నాయకులు పివి ప్రతాప్ మాట్లాడుతూ అప్పటికప్పుడు పదవుల కోసం ప్రజలలోకి వచ్చేవాళ్ళం కాదని కేత గోపాలన్ విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యలపై పనిచేస్తున్నారని అన్నారు.

సిపిఎం ఎజెండా ప్రజల అజెండా అని అన్నారు. సిపిఎంకు వేసే ఓటు, ఆ ఓటు ద్వారా వచ్చే అధికారం ప్రజల కోసమే ఉపయోగపడుతుందని అన్నారు. అత్యధిక ఓట్ల మెజారిటీతో కేతా గోపాలన్ నువ్వు గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎం ఆంజనేయులు ఆకుల హరే రామ్ బత్తుల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆకుల హరే రామ్ జిల్లా నాయకులు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA