Tanuku: తణుకులో 56 ఎంపీటీసీ, 3 జెడ్పీటీసీ నామినేషన్లు పూర్తి!
Tanuku: తణుకు నియోజకవర్గంలో 56 ఎంపీటీసీ, 3 జెడ్పీటీసీ స్థానాలకు కూటమి అభ్యర్థుల నామినేషన్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.
Tanuku: తణుకులో 56 ఎంపీటీసీ, 3 జెడ్పీటీసీ నామినేషన్లు పూర్తి!
తణుకు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తణుకు నియోజవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సమష్టి నిర్ణయంతో పూర్తి చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. స్థానికఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయనమాట్లాడారు.
నియోజకవర్గంలో 56 ఎంపీటీసీ, మూడు జెడ్పీటీసీ స్థానాలకు కూటమి అభ్యర్థులను నిర్ణయించి, వారితో నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు.తణుకు నియోజకవర్గంలో మూడు జెడ్పీటీసీ స్థానాల్లో తెదేపా రెండు, బీజేపీకి ఒక స్థానాన్ని కేటాయించినట్లు తెలిపారు. అత్తిలి జెడ్పీటీసీ స్థానం తెదేపా అభ్యర్థి శిరగాని నాగేశ్వరరావు (నాగు), తణుకు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా తెదేపా నుంచి మట్టా వెంకటేశ్వరరావు (వెంకట్), ఇరగవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పంపన మహాలక్ష్మిలను ఎంపిక చేసినట్లు వివరించారు.
అలాగే ఎంపీపీ పదవుల విషయంలో రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీకి, ఒక స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలిపారు. మూడు పార్టీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ, పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. అత్తిలి మండలంలో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు గాను తెదేపాకు 14, జనసేన 5, బీజేపీకి ఒక స్థానాన్ని కేటాయించామన్నారు.
తణుకు మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు గాను తెదేపాకు 10, జనసేనకు 6, బీజేపీకి ఒక స్థానాన్ని కేటాయించినట్లు చెప్పారు. ఇరగవరం మండలంలో మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలకు గాను తెదేపాకు 12, జనసేనకు 7 స్థానాలను కేటాయించామని వెల్లడించారు. ఇరగవరం మండలంలో జెడ్పీటీసీ స్థానాన్ని బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో ఆ మండలంలో ఎంపీటీసీ స్థానాన్ని బీజేపీకి కేటాయించలేదని తెలిపారు.
మొత్తంగా 56 ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 36, జనసేన పార్టీ 18, బీజేపీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎంపికలో మహిళలతో పాటు యువతకు పెద్దపీట వేసామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ,ఓసీ సామాజిక వర్గాల తో పాటు ఉపకులాలకు సైతం ప్రాతినిధ్యం ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో తణుకు ఇరగవరం అత్తిలి మండలాల కూటమి అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.




