Tanuku: దువ్వలో వరద బాధితులకు ఆహారం, తాగునీటి ప్యాకెట్లు పంపిణీ!
Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో ఎర్ర కాలువ వరద బాధితులకు ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పులిహార, తాగునీటి ప్యాకెట్లను అందజేశారు.
Tanuku: దువ్వలో వరద బాధితులకు ఆహారం, తాగునీటి ప్యాకెట్లు పంపిణీ!
తణుకు: ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవాలని ఉందుర్తి పాల్ ఫౌండేషన్ చైర్మన్ ఉందుర్తి ప్రసన్నకుమార్ అన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం వరద బాధితులకు పులిహార, తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్ర కాలువ ఉదృతంగా ప్రవహించడంతో ఇళ్ల చుట్టూ వరద నీరు ముంచేతిందని బాధితులు ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.




