Poduru: పోడూరు పిహెచ్‌సిలో గర్భిణులకు ముందస్తు వైద్యం

Poduru: భారీ వర్షాలు, తుఫాన్ నేపథ్యంలో ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణులకు ముందస్తు వైద్య సహాయం అందిస్తున్నట్లు పోడూరు PHC వైద్యాధికారి డాక్టర్ శ్రీ వాసవి వెల్లడి.

E.ABRAHAM, ACHANTA
Published on: 4 Nov 2026 10:08 PM IST
Poduru
X

Poduru: పోడూరు పిహెచ్‌సిలో గర్భిణులకు ముందస్తు వైద్యం

పోడూరు: పోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో తుఫాన్ లు వచ్చిన సందర్భం గా ప్రసవం కు దగ్గర గా ఉన్న గర్భిణి స్త్రీలు కు పరీక్షలు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండే విధం గా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా ఎస్ శ్రీ వాసవి తెలిపారు.

వరుస గా వచ్చిన తుఫాను లు వలన అధిక వర్షాలు కురుస్తున్న సందర్భం లో ప్రజలకు సిబ్బంది గృహ సందర్శనం లు చేసి ఆరోగ్య విద్య అందించవలసింది గా సిబ్బంది కి సూచించారు వ్యాధి నిరోధక టీకాలు చిన్న పిల్లలు కు బుధవారం, శనివారం వేస్తున్న సందర్భం లో అర్హులైన పిల్లలకు టీకాలు వేయించాలని తెలిపారు.

ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె బి కె ఎస్ రమేష్ రెడ్డి ఆరోగ్య విస్తరణ అధికారి జె సత్యనారాయణ పి హెచ్ ఎన్ ఎస్ మీరమ్మ ఆరోగ్య పర్యవేక్షకులు సిహెచ్ఎస్ఇఎల్ పద్మ కుమారి పి సుధా రాణి పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA