Poduru: తీన్మార్ డ్యాన్సులు, బాణాసంచా నడుమ ఘనంగా శోభాయాత్ర!

Poduru: పోడూరు మండలం జిన్నూరులో నవ యువత యూత్ ఆధ్వర్యంలో వైభవంగా గణపతి నిమజ్జనోత్సవం: తీన్మార్ డ్యాన్సులు, బాణాసంచా హోరు.. 27న 18 రకాల వంటలతో భారీ అన్నసంతర్పణ.

E.ABRAHAM, ACHANTA
Published on: 24 Sept 2026 8:03 PM IST
Poduru
X

Poduru: తీన్మార్ డ్యాన్సులు, బాణాసంచా నడుమ ఘనంగా శోభాయాత్ర!

పోడూరు: జిన్నూరు గ్రామం నర్సింహారావుపేటలో నవ యువత యూత్ ఆధ్వర్యంలో బుధవారం గణపతి నిమజ్జనోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించారు. తీన్మార్ వాయిద్యాలు, డాన్సులు, బాణాసంచాతో గణపతి నిమ్మజ్జనోత్సవం ఊరేగింపును అంగరంగ వైభవంగా ఉత్సాహభరితంగా జరిపారు. నవ యువత యూత్ ఆధ్వర్యంలో స్థానిక రామాలయం గుడి వద్ద గత తొమ్మిది రోజులుగా గణపతి నవరాత్రి వేడుకలను వైభవంగా జరిపారు.

మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు విశేషంగా జరిపారు. యూత్ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. గణపతి నవరాత్రుల వేడుక ముగింపు సందర్భంగా ఈనెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం 18 రకాల పిండి వంటలతో ఘనంగా అన్నసంతర్పణ జరుపనున్నట్లు నవయువత యూత్ సభ్యులు తెలిపారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA