Penugonda: 11,468 ఓట్ల భారీ మెజార్టీతో పెనుగొండలో కూటమి జయకేతనం!

Penugonda: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ జడ్పీటీసీగా కూటమి అభ్యర్థి చలుమూరి చంద్రశేఖర్ ప్రత్యర్థిపై 11,468 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి విజయకేతనం ఎగురవేశారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 7 Nov 2026 10:50 PM IST
Penugonda
X

Penugonda: 11,468 ఓట్ల భారీ మెజార్టీతో పెనుగొండలో కూటమి జయకేతనం!

పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి చలుమూరి చంద్రశేఖర్ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థిపై 11468 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాల్లో అత్యధిక ఆధిక్యాన్ని నమోదు చేసుకోవడంతో కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. చంద్రశేఖర్ విజయం పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ విజయోత్సవాలు నిర్వహించారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA