Penugonda: పెనుగొండలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే పితాని!

Penugonda: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కుటుంబ సమేతంగా ఓటు వేశారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో లోపాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 5 Nov 2026 9:23 PM IST
Penugonda
X

Penugonda: పెనుగొండలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే పితాని!

పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని 1.వ.వార్డు బజారు రోడ్డు యూపీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆచంట ఎమ్మెల్యే,మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తన సతీమణి అనంతలక్ష్మితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఆయన కుమారుడు పితాని వెంకట్,ఆయన సతీమణి, జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి చలమూరి చంద్రశేఖర్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ పెనుగొండలో ఓటరు స్లిప్పుల పంపిణీలో లోపాలు జరిగాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.పోలింగ్‌కు రెండు రోజుల ముందే ప్రతి ఓటరుకు స్లిప్పులు అందించాల్సి ఉండగా, చాలామందికి అందకపోవడంతో పోలింగ్ కేంద్రాలను గుర్తించడంలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఎన్నికల అధికారులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA