Palakollu: స్వగ్రామం అగర్తిపాలెంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఓటు!

Palakollu: పశ్చిమగోదావరి జిల్లా అగర్తిపాలెంలో మంత్రి నిమ్మల రామానాయుడు కుటుంబంతో కలిసి ఓటు వేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ప్రజలు కూటమికే పట్టం కడుతున్నారని తెలిపారు.

S VENKAT, PALAKOLLU
Published on: 5 Nov 2026 4:28 PM IST
Palakollu
X

Palakollu: స్వగ్రామం అగర్తిపాలెంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఓటు!

పాలకొల్లు: పాలకొల్లు నియోజక వర్గం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తన స్వగ్రామం అయిన అగర్తిపాలెం లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే ప్రజలు కూటమి కీ బ్రాహ్మరధం పడుతున్నారని ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి పధకాలు, సంక్షేమం కూటమి ప్రభుత్వం తోనే సాధ్యం అనీ వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని అప్పగించారని.

అటు అమరావతి, ఇటు పోలవరాన్ని చంద్రబాబు అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తున్నారని ఆర్నబ్ తుఫ్ఫాన్ కారణంగా సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయని ఇదీ కేవలం కూటమి వల్లే సాధ్యం అవుతుందని ప్రజలు అంతా కూటమి ప్రభుత్వం అభివృద్ధినే చూస్తున్నారని కాబట్టే మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి చోటా కూడా కూటమి ప్రభుత్వాన్నే ఆశీర్వదించారని ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రజలంతా కూటమి వైపే ఉన్నారని అయన అన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU