Palakollu: మున్సిపాలిటీలో 44 వార్డులుగా పునర్విభజన పబ్లిక్ నోటీసు జారీ
Palakollu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపాలిటీలో 35 వార్డులను 44 వార్డులుగా పునర్విభజిస్తూ ముసాయిదా నోటీసును కమిషనర్ జారీ చేశారు.
Palakollu: మున్సిపాలిటీలో 44 వార్డులుగా పునర్విభజన పబ్లిక్ నోటీసు జారీ
West Godavari: ప్రభుత్వము వారు జారీ చేసిన జి.ఓ.ఎమ్.ఎస్. నెం: 64, తేది: 24.03.2026 ఎమ్.ఎ & యు.డి. (G) డిపార్టుమెంటు మరియు ప్రభుత్వ సర్క్యులరు ఆర్.ఓ.సి. నెం. 13032/2/2026/H1-2, తేది 06.10.2026, కమీషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్, రాయపూడి వారి ఉత్తర్వులు అనుసరించి పాలకొల్లు పురపాలక సంఘం నందు గల 35 వార్డులను 44 వార్డులుగా నిర్ణయించి చేసిన పునర్విభజన ముసాయిదా పబ్లిక్ నోటీసును పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ అయిన నేను ఈ క్రింది విధముగా పబ్లిక్ నోటీసు జారీ చేయుచున్నాను.
సదరు 35 వార్డులను 44 వార్డులుగా 2011 జనాభా మరియు ది. 01.01.2026 వ తేదీన ప్రచురించబడిన ఎలక్టోరల్ రోల్స్ ఆధారంగా వార్డుల పునర్విభజనలో భాగంగా 44 వార్డులకు హద్దులను నిర్ణయించుచూ ముసాయిదా ప్రతిపాదనను పాలకొల్లు పురపాలక సంఘ కార్యాలయం నందు నోటీసు బోర్డులో ప్రచురించడమైనది. ఇందుపై ఏమైనా సలహాలు/అభ్యంతరములు ఉన్నచో ది. 14.10.2026 వ తేదీ సాయంత్రం 5.00 గం|| లోపు ఆఫీసు పని వేళలలో లిఖితపూర్వకముగా దాఖలు చేయవలసినదిగా తెలియజేయడమైనది.




