Narasapuram: రుస్తుంబాద సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్లపల్లి సోమరాజు గంగాభవాని!

Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్లపల్లి సోమరాజు గంగాభవాని స్థానిక సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 16 Nov 2026 5:20 PM IST
Narasapuram
X

Narasapuram: రుస్తుంబాద సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్లపల్లి సోమరాజు గంగాభవాని!

నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్లపల్లి సోమరాజు గంగాభవాని స్థానిక సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ.. తన తండ్రి 35 సంవత్సరాల పాటు ఏకధాటిగా గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు.

ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, ప్రజాసేవా తత్పరత తనకు చిన్నతనం నుంచే స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ గ్రామ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని సోమరాజు గంగాభవాని వెల్లడించారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM