Bhimavaram: పశ్చిమగోదావరిలో రేపు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్ ఆదేశం
Bhimavaram: భారీ వర్షాల దృష్ట్యా పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెప్టెంబర్ 25న పరిహార సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు.
Bhimavaram: పశ్చిమగోదావరిలో రేపు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్ ఆదేశం
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్లకు చెందిన, అన్ని కేటగిరీల విద్యాసంస్థలకు సెప్టెంబర్ 25, 2026న పరిహార సెలవు దినంగా (Compensatory Holiday) ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల సిబ్బంది ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయ తీసుకున్నట్లు తెలిపారు.




