Jangareddygudem: అటవీ రేంజ్‌లో రూ. 1.18 కోట్లకు పైగా వీఎస్ఎస్ నిధుల పంపిణీ!

Jangareddygudem: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రేంజ్‌లో యూకలిప్టస్ ప్లాంటేషన్ల వీఎస్ఎస్ ఆదాయ నిధులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Sept 2026 7:33 AM IST
Jangareddygudem
X

Jangareddygudem: అటవీ రేంజ్‌లో రూ. 1.18 కోట్లకు పైగా వీఎస్ఎస్ నిధుల పంపిణీ!

Jangareddygudem: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రేంజ్లో యూకలిప్టస్ ప్లాంటేషన్లకు సంబంధించిన 50% వన సంరక్షణ సమితి (VSS) ఆదాయ నిధులు రూ.1.19 కోట్లు అర్హులైన సభ్యులకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు బుధవారం పంపిణీ చేశారు.కనకాపురం వీఎస్ఎస్: రూ. 46,16,231/-లు,వెలుగువారిగూడెం వీఎస్ఎస్:రూ.42,62,265/-లు,జిల్లెళ్ళగూడెం వీఎస్ఎస్: రూ.30,17,270/-లు,మొత్తం పంపిణీ మొత్తం: రూ.1,18,95,766/- లు చెక్కుల ద్వారా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ అటవీ సంపద సమాజానికి అత్యంత కీలకమైనదని, అడవులను నరికివేతకు గురికాకుండా, దొంగతనాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. వీఎస్ఎస్ ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు గ్రామానికి ఉపయోగపడే శాశ్వత ఆస్తులను సమకూర్చుకోవాలని సూచించారు.

జిల్లా అటవీ అధికారి పి.వి.సందీప్ రెడ్డి మాట్లాడుతూ అటవీ శాఖ మరియు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన కమిటీలకు నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. ఈ నిధులను కేవలం ఖర్చులకే పరిమితం చేయకుండా,స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల సలహాలు తీసుకుంటూ సామజిక ప్రయోజనాలు, భవిష్యత్ తరాల అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవాలని కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు.

అటవీ సంరక్షణలో గ్రామీణ ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, వారి శ్రమకు తగిన ప్రతిఫలంగా ఈ లబ్ధిని ప్రభుత్వం సమకూర్చిందన్నారు.ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సబ్ డీఎఫ్ఓ ఎ.వెంకట సుబ్బయ్య,ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.దుర్గా కుమార్ బాబు,స్థానిక అటవీ శాఖ సిబ్బంది మరియు సంబంధిత వీఎస్ఎస్ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్