Penumantra: విశ్వకర్మ ఆశీర్వాదంతో వికసిత భారత్ నిర్మాణం: పెనుమంట్రలో వేడుకలు

Penumantra: పెనుమంట్ర మండలం మాముడూరులో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 17 Sept 2026 9:56 PM IST
Penumantra
X

Penumantra: విశ్వకర్మ ఆశీర్వాదంతో వికసిత భారత్ నిర్మాణం: పెనుమంట్రలో వేడుకలు

పెనుమంట్ర: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ‘విశ్వకర్మ ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ’ కార్యక్రమంలో భాగంగా విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆచంట నియోజకవర్గ స్థాయిలో పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది.

ఓబీసీ మోర్చా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు గున్నేపల్లి పుల్లాజి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్వకర్మలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా సేవ, సుపరిపాలన, ప్రజా సంక్షేమాన్ని పునాదులుగా చేసుకుని దేశ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అన్నారు.

అభివృద్ధి, ఆత్మనిర్భరత, మహిళా సాధికారత లక్ష్యాలతో వికసిత భారత్‌ నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తున్న మోడీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో భారత్‌ త్వరలో విశ్వగురు స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తుప్పాకుల గోవిందాచార్యులు, మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్, విశ్వకర్మల జిల్లా కోశాధికారి ముంగండి శివప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షులు మారుతి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోపి సుందర్‌రావు, పశ్చిమ గోదావరి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కడల్ రాజా, కోడి నరసింహ, ఆకేటి వెంకట్రావు, దేవగుప్తాపు చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

విశ్వకర్మ కుల సంఘ పెద్దలు, అభిమానులు, కూటమి నాయకులు, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA