Palakollu: పాలకొల్లులో విద్యార్థులకు ప్రత్యేక పోటీలు!

Palakollu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో విద్యార్థుల కోసం వికసిత్ భారత్ ఇరవై నలభై ఏడు అంశంపై ప్రత్యేకంగా చిత్రలేఖన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు.

S VENKAT, PALAKOLLU
Published on: 1 Oct 2026 7:19 AM IST
Palakollu
X

Palakollu: పాలకొల్లులో విద్యార్థులకు ప్రత్యేక పోటీలు!

Palakollu: జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు పాలకొల్లు పట్టణ స్థాయి చిత్రలేఖన, వక్తృత్వ పోటీలు ఎం.ఎం.కె.ఎన్. ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ‘వికసిత్ భారత్–2047: భారతదేశం ఎలా ఉండాలి–విద్యార్థుల కలలు’ అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో పట్టణంలోని 12 పాఠశాలలకు చెందిన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకత, ఆలోచనా శక్తిని చిత్రలేఖనం, వక్తృత్వం ద్వారా ప్రదర్శించారు.

మండల విద్యాశాఖ అధికారి ఆర్.ఎన్.వి.జి. శర్మ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భవిష్యత్ భారతదేశంపై విద్యార్థుల్లో అవగాహన, సృజనాత్మక ఆలోచనలు పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయని తెలిపారు.

కార్యక్రమంలో పట్టణ బీజేపీ తరఫున కొల్లికొండ ప్రసాద్, ఉన్నమట్ల కబర్ది, రావూరి సుధ, గవర పవన్ నాయుడు, వేరుకొండ దుర్గాప్రసాద్, నాళం బాబీ, మల్లవోలు సురేష్, చెరుకూరి శ్రీనివాసరావు, చేగొండి బాబీ, పడవల ఉమా శ్రీనివాస్ పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.వి. సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఎస్. రాధాకృష్ణ, జి. లక్ష్మీనారాయణ, వై.వి. ప్రసన్న, జె. అరుణశ్రీతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU