Narsapuram: నరసాపురం ఎంపీపీగా వాతాడి ఉమామహేశ్వరరావు ప్రమాణం!

Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆర్వో డాక్టర్ జి. సునీత ఆధ్వర్యంలో ఎంపీపీగా వాతాడి ఉమామహేశ్వరరావు ప్రమాణం చేశారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Updated on: 19 Nov 2026 7:41 PM IST
Narsapuram
X

Narsapuram: నరసాపురం ఎంపీపీగా వాతాడి ఉమామహేశ్వరరావు ప్రమాణం!

నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నరసాపురం ఎంపీపీగా వాతాడి ఉమామహేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. రిటర్నింగ్ అధికారి డాక్టర్ జి. సునీత ఆయనతో పాటు వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ, కో-ఆప్షన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, టిడిపి ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు హాజరై నూతన ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను అభినందించి సత్కరించారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM