Undi: రఘురామ ఆశీస్సులతో చినిమిల్లిపాడు సర్పంచ్ బరిలో బాలాజీ!
Undi: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆశీస్సులతో చినిమిల్లిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ‘కత్తెర’ గుర్తుపై పోటీ చేస్తున్నట్లు అభ్యర్థి గురదాసి బాలాజీ ప్రకటించారు.
Undi: రఘురామ ఆశీస్సులతో చినిమిల్లిపాడు సర్పంచ్ బరిలో బాలాజీ!
ఉండి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఆశీస్సులతో తాను చినిమిల్లిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు అభ్యర్థి గురదాసి బాలాజీ ప్రకటించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం తనకు 'కత్తెర' గుర్తును కేటాయించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ, "డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారి సహకారంతో చినిమిల్లిపాడు గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం అని తెలిపారు. సురక్షిత మంచినీళ్లు, సిసి రోడ్లు గ్రామంలో పాఠశాల కల్పనకై కృషి చేస్తానని తెలియజేశారు. గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి, కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.




