West Godavari: ఉండి సర్పంచ్ కూటమి అభ్యర్థిగా కరిమెరక నాగరాజు పోటీ!

West Godavari: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆశీస్సులతో ఉండి సర్పంచ్ కూటమి అభ్యర్థిగా టీడీపీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు పోటీ చేస్తున్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 27 Nov 2026 4:58 PM IST
West Godavari
X

West Godavari: ఉండి సర్పంచ్ కూటమి అభ్యర్థిగా కరిమెరక నాగరాజు పోటీ!

West Godavari: ఉండి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఉండి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికల ప్రణాళికను, లక్ష్యాలను వివరించారు.​ఉండి శాసనసభ్యులు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఆశీస్సులతో తాను సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు కరిమెరక నాగరాజు తెలిపారు. రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉండి గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

​గ్రామంలోని ప్రజలందరికీ సురక్షితమైన మంచినీరు అందించడం, దీర్ఘకాలికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడం మరియు గ్రామానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని నాగరాజు స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధిని కాంక్షించి, ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు వేసి తనను సర్పంచ్‌గా గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM