Tanuku: తణుకు 14వ వార్డులో తెదేపా అభ్యర్థి స్వర్ణలత జోరుగా ప్రచారం!
Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ ఎన్నికల 14వ వార్డు తెదేపా అభ్యర్థి చిట్టూరి స్వర్ణలత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Tanuku: తణుకు 14వ వార్డులో తెదేపా అభ్యర్థి స్వర్ణలత జోరుగా ప్రచారం!
Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికల్లో 14 వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిట్టూరి స్వర్ణలత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆమే ప్రతి ఇంటికీ వెళ్లి స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.
కూటమితోనే అభివృద్ధి సాధ్యమని వార్డు ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. గతంలో కౌన్సిలర్ గా పని చేసిన అనుభవంతో పాటు వార్డులో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకొని సైకిల్ గుర్తుపై వేసి ఆఖండ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిట్టూరి సాయిబాబు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




