Tanuku: తారకాపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు!
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో తారకాపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి, నిరుపేదలకు మరియు బాధితులకు ఆర్థిక సహాయం అందించారు.
Tanuku: తారకాపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు!
Tanuku: తారకాపురి లైన్స్ క్లబ్ అధ్యక్షుడు బెజవాడ సూరిబాబు అధ్యక్షతన తణుకు ఓ హోటల్లో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనతి కాలంలోఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలతో జిల్లాల తారకపురి క్లబ్ కు మంచి గుర్తింపు ఉందని కొనియాడుతూ క్లబ్లో మంచి సేవలు చేస్తున్న పలువురికి డిస్టిక్ పిన్నులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దామెర రంగారావు బొమ్మల వీధి పలికి భగవాన్ ప్రార్థనా మందిరానికి ఎయిర్ కండిషనర్ ను , కష్టకాలంలో ఉన్న మహిళలకు కుట్టుమిషన్లను వావిలాల వెంకటరమేష్ సరళాదేవి దంపతులు , పళ్ళ వ్యాపారస్తులకు
గొడుగులను ప్రెసిడెంట్ సెక్రటరీలు, ఇటీవలకాలంలో యాక్సిడెంట్లో తల్లిని కోల్పోయిన చిన్నారికి రూ.5 వేలు ఆర్థిక సహాయం, సెక్రెటరీ రాంకుమార్ డయాబెటిక్ క్యాంపును, రీజనల్ చైర్ పర్సన్ కొట్టారీ సజని, వైద్య సేవలను సానబోయిన సుబ్రహ్మణ్యం, మరొక కుట్టు మిషన్ డాక్టర్ నాగేశ్వరరావు మహిళకి అందజేశారు.అనంతరం క్లబ్ సభ్యులు గవర్నర్ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రమేష్ గుప్తా, ఆకురాతి శ్రీనివాస్, బత్తుల రమణ, పాల పెద్దిరాజు, వానపల్లి సుబ్రహ్మణ్యం, గిద్దా ధనరాజు, కొత్త శ్యామల, ఎం జ్యోతి, వి నాగలక్ష్మి తణుకు లైన్స్ క్లబ్ నాయకులు పెచ్చట్ రాంబాబు, పివి రమణ,కోడూరు సత్యనారాయణ,వాతాడ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.




