Tarakapuri: మహిళల కోసం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ శిబిరం

Tarakapuri: తారకాపురి లైయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళల కోసం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వైద్య శిబిరం. 120 మందికి ఉచితంగా టీకాలు. ఎమ్మెల్యే ఆరిమిల్లి ప్రారంభం.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 18 Sept 2026 8:46 PM IST
Tarakapuri
X

Tarakapuri: మహిళల కోసం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ శిబిరం

తారకాపురి: మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు తారకాపురి లైయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

తారకాపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సత్యవతి నర్సింగ్ హోమ్ లో నిర్వహించిన సర్వేకల్ వ్యాక్సిన్ వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వెంకట రమేష్,సరళాదేవి దంపతుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా లయన్స్ గేట్ మెంబర్ సరళాదేవి మాట్లాడుతూ మహిళలు క్యాన్సర్ భారీన పడకుండా ఉండే వ్యాక్సిన్ యుక్త వయసులో వారికి ఇవ్వడం అత్యంత ఉత్తమ సేవగా భావిస్తున్నామని తెలిపారు.

క్లబ్ అధ్యక్షుడు సూరిబాబు ఆధ్వర్యంలో సెక్రటరీ రామకుమార్ పర్యవేక్షణలో వావిలాల వెంకటరమేష్, సరళాదేవి సౌజన్యంతో డాక్టర్ సత్యవతి వైద్య సహాయంతో 120 మంది మహిళలకు సర్వేకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో లయన్స్ ఫాస్ట్ గవర్నర్ పాపారావు నాయుడు, గేట్ మెంబర్ పుట్టా విజయశ్రీ,ట్రెజరర్ రమేష్ గుప్తా, ఫాస్ట్ ప్రెసిడెంట్ వావిలాల పవన్ కుమార్, లైన్స్ నాయకులు కొట్టారి సజని, కంబాల రంగారావు, మట్ట వెంకట్ ,పీవీ రమణ, వాతాడ రంగనాథ్, ఏ బాలాజీ, ఆకురాతి శ్రీనివాస్, బత్తుల రమణ, పాలరాజు, కే శ్యామల, ఎం జ్యోతి, బి సత్య శ్రీ,, ఎ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)