Tanuku: ఎమ్మెల్యే ఆరిమిల్లి వ్యాఖ్యలపై ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం

Tanuku: తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైకాపా నేత వడ్లూరి సీతారాం తీవ్ర విమర్శలు చేశారు. ఇళ్ల పట్టాల రీ-ప్రింటింగ్‌పై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 14 Oct 2026 7:34 PM IST
Tanuku
X

Tanuku: ఎమ్మెల్యే ఆరిమిల్లి వ్యాఖ్యలపై ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం

తణుకు: తణుకు నియోజకవర్గంలో గత ప్రభుత్వాల హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను అవే సర్వే నెంబర్లతో తిరిగి ముద్రించి పేదలకు ఇచ్చి మోసం చేస్తున్నారని ప్రశ్నిస్తే సన్యాసులంటారాని ఇది ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ విజ్ఞతకే వదిలేస్తున్నామని వైకాపా పంచాయతీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం అన్నారు. స్థానిక వైకాపా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వం అసమర్ధ పాలనపై, ఎమ్మెల్యే రాధాకృష్ణ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.

గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను అవే సరిహద్దులు, సర్వే నెంబర్లతో భర్త పేరుకు బదులు భార్య పేరుతో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం సమంజసం కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎవరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం వైఎస్సార్‌సీపీ విధానం కాదని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ప్రజలకు చెప్పుకోదగిన ప్రయోజనాలు చేకూరలేదని సీతారాం విమర్శించారు.

నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయని, సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.

ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రతిపక్షంగా తమ బాధ్యతన్నారు. అయితే, ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బహిరంగ సభలో వైసీపీ నాయకులను ఉద్దేశించి ‘సన్నాసుల్లారా’ అంటూ వ్యాఖ్యానించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు ఇండిగుపల్లి బలరాం, మారిశెట్టి గిరి, వెలగల సాయిబాబా రెడ్డి, జగన్, మెహర్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)