Tanuku: తణుకు 34వ వార్డులో వైకాపా అభ్యర్థి సిరాజుద్దీన్ ప్రచారం
Tanuku: తణుకు పట్టణం 34వ వార్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి మహమ్మద్ సిరాజుద్దీన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు; ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థన.
Tanuku: తణుకు 34వ వార్డులో వైకాపా అభ్యర్థి సిరాజుద్దీన్ ప్రచారం
తణుకు: తణుకు పట్టణంలో 34వ వార్డులో వైఎస్ఆర్సిపి నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. రంగం తోట, తోట వారి వీధి, గుట్ల వారి వీధి ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మహమ్మద్ సిరాజుద్దీన్, వార్డు ఇన్‌ఛార్జి సప్పా బలరామకృష్ణలు కూటమి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేక పోయిందని విమర్శించారు.
ఈ సందర్భంగా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తణుకు పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం వైఎస్ఆర్సిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యిండుగపల్లి బలరామకృష్ణ, వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆ ఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ సప్పా వంశీ, పాల వెంకటేష్, పాల శంకర్ యాదవ్, కోళ్ల శివ, దోళ్ల ప్రదీప్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




