Tanuku: తుపాను బాధిత కుటుంబాలకు బరకాలు పంపిణీ చేసిన ఉందుర్తి ఫౌండేషన్

Tanuku: తణుకు కొండాలమ్మ పుంత రోడ్డులో తుపాను బాధిత 13 నిరుపేద కుటుంబాలకు ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉచితంగా తార్పాలిన్ల పంపిణీ.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 6 Nov 2026 7:48 PM IST
Tanuku
X

Tanuku: తుపాను బాధిత కుటుంబాలకు బరకాలు పంపిణీ చేసిన ఉందుర్తి ఫౌండేషన్

తణుకు: తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శుక్రవారం బరకాల (టార్పాలిన్లు) పంపిణీ చేశారు. తణుకు కొండాలమ్మ పుంత రోడ్డులో నివసిస్తున్న 13 బాధిత కుటుంబాలకు రూ.26,250 విలువచేసే తార్పాలిన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ఉందుర్తి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తాత్కాలిక రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

ఆపద సమయంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం తమ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా ఆహారం, విద్య, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తణుకు సిటీ పేజ్ సతీష్, వెస్ట్ గోదావరి పేజ్ కృష్ణ, గోదావరి రీల్ పేజ్ శివ తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)