Tanuku: తణుకు మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ!

Tanuku: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తాడేపల్లిగూడెం డీఎస్పీ బి.నరసింహారావు తెలిపారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 15 Nov 2026 3:27 PM IST
Tanuku
X

Tanuku: తణుకు మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ!

తణుకు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తాడేపల్లిగూడెం డిఎస్పి బి.నరసింహారావు తెలిపారు. తణుకు మండలం వెంకట్రాయపురం, వీరభద్రపురం, పైడిపర్రు పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు.

ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. సమస్యత్మక పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట తణుకు గ్రామీణ సీఐ డి. వెంకటేశ్వరరావు,గ్రామీణ ఎస్సై ఎన్ శ్రీనివాసరావులు ఉన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)