Tanuku: తణుకు మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ల గెజిట్ విడుదల
Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపాలిటీలో 44 వార్డులకు రిజర్వేషన్ల గెజిట్ విడుదల. 75,465 మంది ఓటర్ల ఆధారంగా కేటాయింపులు పూర్తి.
Tanuku: తణుకు మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ల గెజిట్ విడుదల
తణుకు: తణుకు పురపాలక సంఘ పరిధిలో వార్డులు వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ను విడుదల చేసింది.
పురపాలక సంఘ పరిధిలో గతంలో 34 వార్డులు ఉండగా వాటిని 44 వార్డులుగా ప్రస్తుతం పునర్విభజన చేశారు. మున్సిపల్ పరిధిలో మొత్తం 75,465 మంది ఓటర్లు ఉండగా వీరిలో 36,202 మంది పురుషులు, 39,260 మంది మహిళలు, ఇతరులు ముగ్గురు ఉన్నారు.
ఈ గెజిట్ ప్రకారం 44 వార్డులకు సంబంధించి ఆయా సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి:
* ఎస్టీ జనరల్‌కు 2 వార్డు కేటాయించగా, ఎస్సీ మహిళలకు 4, 16 వార్డులు, ఎస్సీ జనరల్‌కు 10, 13, 20 వార్డులు కేటాయించారు.
* బీసీ మహిళలకు 3, 6, 7, 8, 12, 31, 41, 43 వార్డులు, బీసీ జనరల్‌కు 1, 5, 11, 32, 33, 34, 36, 44 వార్డులు కేటాయించారు.
* మహిళ జనరల్ కు 9, 14, 15, 22, 23, 24, 25, 27, 28, 30, 37, 39 వార్డులు కేటాయించారు.
* జనరల్ క్యాటగిరికి సంబంధించి 17, 18, 19, 21, 26, 29, 35, 38, 40, 42 వార్డులను ఖరారు చేశారు.




