Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికలు: తొలి రోజే ఎనిమిది నామినేషన్లు!
Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే 8 నామినేషన్లు దాఖలయ్యాయని కమిషనర్ రామ్ కుమార్ శనివారం తెలిపారు.
Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికలు: తొలి రోజే ఎనిమిది నామినేషన్లు!
తణుకు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే 8 నామినేషన్లు దాఖలయ్యాయి. తణుకు పట్టణ పరిధిలో 44 వార్డులకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామ పత్రాలు స్వీకరించడానికి మున్సిపల్ కార్యాలయంలో 11 నామినేషన్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలుత ఎనిమిదో వార్డు నుంచి వైకాపా అభ్యర్థి కాకరపర్తి సుబ్బలక్ష్మి నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ మాట్లాడుతూ తణుకు పట్టణంలో వైకాపా నుంచి ఏడుగురు అభ్యర్థులు, సిపిఎం నుంచి ఒక అభ్యర్థి నామినేషన్లకు దాఖలు చేసినట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రం వద్ద ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్నికల సందడి నెలకొంది.




