Tanuku: తణుకు 3వ వార్డులో బలరామకృష్ణ, ఇందిరా జ్యోతి ఇంటింటి ప్రచారం!

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ చైర్మన్ అభ్యర్థి బలరామకృష్ణ, 3వ వార్డు సీపీఐ అభ్యర్థిని ఇందిరా జ్యోతి ఇంటింటి ప్రచారం చేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 21 Nov 2026 5:19 PM IST
Tanuku
X

Tanuku: తణుకు 3వ వార్డులో బలరామకృష్ణ, ఇందిరా జ్యోతి ఇంటింటి ప్రచారం!

తణుకు: తణుకు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ చైర్మన్ అభ్యర్థి యిండుగపల్లి బలరామకృష్ణ, వైసీపీ, సీపీఎం బలపరిచిన 3వ వార్డు సీపీఐ అభ్యర్థిని బొద్దాని ఇందిరా జ్యోతి కలిసి శనివారం 3వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ఎన్నికల్లో తమకు మద్దతు తెలియజేయాలని అభ్యర్థించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, వైసీపీ నాయకులు చోడే గోపి, బసవా గణేష్‌తో పాటు సీపీఐ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)