Tanuku: ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా చైర్మన్ అభ్యర్థి రామకృష్ణ!
Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెదేపా చైర్మన్ అభ్యర్థి బసవ రామకృష్ణ గురువారం 24వ వార్డులోని ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Tanuku: ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా చైర్మన్ అభ్యర్థి రామకృష్ణ!
తణుకు: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెదేపా చైర్మన్ అభ్యర్థి బసవ రామకృష్ణ తన ఓటు హక్కును గురువారం 24 వార్డులో ఉన్న ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
పుష్కరకాలం తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగ రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరును ప్రజలు దృష్టిలో ఉంచుకుని తమకు మద్దతు ఇస్తున్నారని గెలుపు తమదేనిని ధీమా వ్యక్తం చేశారు.




