Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన చీర్ల రాధయ్య దంపతులు!
Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా పైడిపర్రు మాజీ సర్పంచుల దంపతులు చీర్ల రాధయ్య, చీర్ల పద్మశ్రీ గురువారం 21వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన చీర్ల రాధయ్య దంపతులు!
తణుకు: తణుకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా పైడిపర్రు మాజీ సర్పంచి దంపతులు చీర్ల రాధయ్య, చీర్ల పద్మశ్రీలు గురువారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం పైడిపర్రు గ్రామం వార్డుల పునర్విభజన, గ్రామాల విలీన ప్రక్రియలో భాగంగా తణుకు మున్సిపాలిటీలో విలీనమైన సంగతి తెలిసిందే.
అయితే గతంలో పైడిపర్రు పంచాయతీ గా ఉన్న సమయంలో రాదయ్య, పద్మశ్రీ లు సర్పంచులుగా బాధ్యతలు నిర్వహించారు. గ్రామం పురపాలక సంఘంలో విలీనమైన తర్వాత పట్టణ పరిధి 21 వార్డులో రాధ య్య దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.




