Tanuku: తణుకు మున్సిపల్ టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణ నామినేషన్ దాఖలు!
Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా బసవ రామకృష్ణ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, కూటమి నేతలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
Tanuku: తణుకు మున్సిపల్ టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణ నామినేషన్ దాఖలు!
తణుకు: తణుకు మున్సిపల్ చైర్మన్ తెదేపా అభ్యర్థిగా బసవ రామకృష్ణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10 గంటలకు కూటమి కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తో పాటు తెదేపా, జనసేన, భాజపా పార్టీల నాయకులతో కలసి భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి వెళ్లారు.
ముహూర్తం ప్రకారం నామినేషన్ దాఖలు చేశారు. నామ పత్రాలను సంబంధిత మున్సిపల్ ఎన్నికల అధికారులు స్వీకరించారు. బాణ సంచ, మేళ్ళ తా ళాలతో చైర్మన్ అభ్యర్థి రామకృష్ణ పట్టణంలో ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది.




