Tanuku: హైవే అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆరిమిల్లి తీవ్ర ఆగ్రహం
Tanuku: ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ల దుస్థితి, తరచూ ప్రమాదాలపై జాతీయ రహదారి నిర్వహణ అధికారులపై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tanuku: హైవే అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆరిమిల్లి తీవ్ర ఆగ్రహం
Tanuku: జాతీయ రహదారి నిర్వహణ అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు ధ్వంసమై, వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై సంబంధిత హైవే నిర్వహణ అధికారులతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి, రహదారుల పరిస్థితిపై తీవ్రంగా ప్రశ్నించారు. సర్వీస్ రోడ్లు దెబ్బతిని గుంతలు ఏర్పడటం, రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు.
సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తూతూమంత్రంగా పనులు చేపట్టడం వల్లే రహదారులు కొద్దికాలానికే ధ్వంసమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాధనంతో చేపట్టే రహదారి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాత్కాలిక మరమ్మతులతో సమస్యను పరిష్కరించినట్లు చూపకుండా, రహదారి దుస్థితికి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాను సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఉండ్రాజవరం జంక్షన్ వద్ద రహదారి పరిస్థితిని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాహనదారులకు ఇబ్బందులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.




