Tanuku: కూటమి అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి విస్తృత ప్రచారం
Tanuku: పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేశారు.
Tanuku: కూటమి అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి విస్తృత ప్రచారం
తణుకు: పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించి కూటమి అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి, వారి విజయానికి మద్దతు కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందాలంటే స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం అవసరమని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గ్రామస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమన్వయం అవసరమని అన్నారు. ఈ నేపథ్యంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




