Tanuku: తణుకు ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి పర్యటన!
Tanuku: తణుకులో ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటన: వర్షపు నీటిని వెంటనే తొలగించాలని ఆదేశం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మున్సిపల్ యంత్రాంగం చర్యలు.
Tanuku: తణుకు ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి పర్యటన!
తణుకు: భారీ వర్షాల నేపథ్యంలో తణుకు పట్టణంలో పలు ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం పర్యటించారు. ముంపు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి, స్థానికులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పదో వార్డులో ముంపు బారిన పడిన ప్రాంతాలను పరిశీలించారు.
వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని త్వరితగతిన తొలగించేలా చర్యలు చేపట్టాలని, నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా డ్రెయిన్లు, కాలువలను పరిశీలించాలని అధికారులను కోరారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం, అధికారులు అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు.




