Tanuku: ముంపు బాధితులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

Tanuku: తణుకు నియోజకవర్గంలోని ఈడూరు, తిరుపతిపురం, వరిగేడు ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై పర్యటించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. రైతులకు పశువుల దాణా పంపిణీ.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 9 Nov 2026 3:49 PM IST
Tanuku
X

Tanuku: ముంపు బాధితులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో నీటమునిగిన తణుకు నియోజకవర్గంలోని ఈడూరు, తిరుపతిపురం, వరిగేడు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం ట్రాక్టర్ పై పర్యటించి ముంపు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని, ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

పంటల బీమా, నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.పశుగ్రాసం కొరతను దృష్టిలో ఉంచుకుని పలు గ్రామాల్లో రైతులకు 25 నుంచి 50 కిలోల వరకు పశువుల దాణా పంపిణీ చేసినట్లు తెలిపారు.

ప్రజలకు, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ముంపు సమస్యల పరిష్కారానికి బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పష్టం చేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)