Tanuku: బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులతో ‘అవనిక్’ ప్రారంభం: ఎమ్మెల్యే

Tanuku: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తణుకు యువకుడు ప్రహీత్ స్థాపించిన బయోడిగ్రేడబుల్ ఉత్పత్తుల సంస్థ ‘అవనిక్’ను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రశంసించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 10 Oct 2026 6:04 PM IST
Tanuku
X

Tanuku: బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులతో ‘అవనిక్’ ప్రారంభం: ఎమ్మెల్యే

Tanuku: తణుకు ప్రాంతానికి చెందిన యువకుడు ప్రహీత్ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా వినూత్న ఆలోచనతో ‘అవనిక్’ సంస్థను ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రకృతికి హాని కలిగించని, పర్యావరణహిత ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రహీత్ చేపట్టిన ఈ ప్రయత్నం తణుకుకు గర్వకారణమని పేర్కొన్నారు.

‘ఫ్రమ్ ద నేచర్.. బ్యాక్ టు ద నేచర్’ అనే నినాదంతో ప్రకృతి నుంచి లభించే వనరులను వినియోగించుకుని, పర్యావరణానికి మేలు చేసే ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ప్రహీత్ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు.

బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగులు, కొబ్బరి పొట్టు వంటి సహజ వనరుల నుంచి తయారు చేసిన గ్లాసులు, వక్క నుంచి తయారు చేసిన ప్లేట్లు, వెదురుతో రూపొందించిన టూత్ బ్రష్‌లు, పెన్నులు వంటి పర్యావరణహిత ఉత్పత్తులను ‘అవనిక్’ సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు.

ప్రకృతికి హాని కలిగించే వ్యర్థాలను తగ్గించడం, సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ప్రకృతి నుంచి లభించే వనరులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవడంతో పాటు, వ్యర్థాల పునర్వినియోగం, పర్యావరణహిత ప్రత్యామ్నాయాల వినియోగానికి ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత కాలంలో పర్యావరణ పరిరక్షణ ప్రపంచవ్యాప్తంగా కీలక అంశంగా మారిందని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతికి అనుకూలమైన ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని అన్నారు.

యువత నూతన ఆలోచనలతో ముందుకు వచ్చి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ప్రహీత్ ప్రారంభించిన ‘అవనిక్’ సంస్థ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పర్యావరణహిత జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)