Tanuku: స్థానిక ఎన్నికల్లో కూటమికి 100% స్ట్రైక్ రేట్: ఎమ్మెల్యే ఆరిమిల్లి!
Tanuku: తణుకు మండలం వేల్పూరులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 100% విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Tanuku: స్థానిక ఎన్నికల్లో కూటమికి 100% స్ట్రైక్ రేట్: ఎమ్మెల్యే ఆరిమిల్లి!
తణుకు: తణుకు నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోందని, ఈ ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులు 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధిస్తారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం తణుకు మండలం వేల్పూరు జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని 48వ నంబర్ బూత్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల అధికారులను అడిగి పోలింగ్ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తణుకు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వేల్పూరు గ్రామంలో అప్పటికే సుమారు 35 శాతం పోలింగ్ పూర్తయిందని, నియోజకవర్గంలోని ఇతర గ్రామాల్లోనూ 25 నుంచి 30 శాతం వరకు పోలింగ్ నమోదైందని తెలిపారు.
పోలింగ్ ముగిసే సమయానికి 70 నుంచి 75 శాతం వరకు ఓటింగ్ నమోదవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, ఈ ఎన్నికలు ప్రభుత్వ సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టే అవకాశమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజల నుంచి కూటమి అభ్యర్థులకు మంచి స్పందన లభించిందని, అదే ఆదరణ ఓటు రూపంలోనూ లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తణుకు నియోజకవర్గంలో మొత్తం 56 ఎంపీటీసీ స్థానాలకు గాను నాలుగు స్థానాలు ఇప్పటికే కూటమికి అనుకూలంగా ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 52 ఎంపీటీసీ స్థానాలతో పాటు మూడు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు. ఈ స్థానాలన్నింటిలోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీటీసీ అభ్యర్థులు కూటమి నాయకులు పాల్గొన్నారు.




