Tanuku: న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
Tanuku: విజయవాడలో న్యాయవాదులపై పోలీసుల దాడిని ఖండిస్తూ తణుకులో కోర్టు విధులను బహిష్కరించి ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా
Tanuku: న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
తణుకు: న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడలో న్యాయవాదులపై పోలీసులు జరిపిన దాడికి నిరసనగ గురువారం తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ విజయవాడ బారు అసోసియేషన్ సభ్యుడు ఒగ్గు గవాస్కారిపై రౌడీ షీటర్ పెట్టాలని, కొంతమంది న్యాయవాదులపై తప్పుడు కేసులను పోలీసులు బనాయించారని తెలిపారు.
న్యాయవాదులు విజయవాడలో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని కోరుతూ వెళ్ళుచున్న న్యాయవాదులపై విజయవాడ పోలీసులు రోప్ పార్టీలతో వారి నిర్బంధించి మహిళ న్యాయవాదులని చూడకుండా వారిపై అమానుష్యంగా దాడి చేయడాన్ని మునిస్వామి తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రశ్నించే హక్కుని లేకుండా చేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న ప్రజానాయకులపై మేధావులపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రాజ్యాంగము ప్రసాదించిన వాక్ స్వతంత్ర హక్కును ప్రభుత్వాలు లేకుండా చేయడాన్ని ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అన్నారు.
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ న్యాయవాదులు పోలీసులు మధ్య సమన్వయము పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి అంబేద్కర్,ఈద రామకృష్ణ, వి.వి సత్య సాయి, వేండ్ర మురళి, లంక రాంబాబు, జె. శ్రీనివాస్,పి.రాజేంద్ర, సిద్ధం తదితరులు పాల్గొన్నారు.




