Tanuku: తేతలిలో జన సంద్రోహం మధ్య ముగిసిన కోట నాగేశ్వరరావు ప్రచారం

Tanuku: తణుకు మండలం తేతలి సర్పంచి స్వతంత్ర అభ్యర్థి కోట నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం ముగింపు; కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 27 Nov 2026 11:39 PM IST
Tanuku
X

Tanuku: తేతలిలో జన సంద్రోహం మధ్య ముగిసిన కోట నాగేశ్వరరావు ప్రచారం

తణుకు: తణుకు మండలం తేతలి గ్రామ సర్పంచి స్వతంత్ర అభ్యర్థి కోట నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం జన సంద్రోహం మధ్య శుక్రవారంతో ముగిసింది. ప్రారంభం నుంచి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కోట ఎన్నికల ప్రచారం విజయోత్సవ ర్యాలీని తలపిస్తున్న విధంగా సాగింది. నాగేశ్వరరావు ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తుంటే హారతులిచ్చి స్వాగతం పలికారు.

ఏ వీధికి వెళ్ళిన, ఏ సంఘానికి వెళ్ళిన, ఏ ఆలయానికి వెళ్ళిన ఆయనకు నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఆయన సొంత నిధులతో గ్రామానికి చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలు తనకింత గుర్తింపునిచ్చి గ్రామ ప్రజలు తనను ఆశీర్వదిస్తున్నారని విజయం తమదేనని నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.

కత్తెర గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)