Tanuku: అభివృద్ధిని చూసి ఓటు వేయండి తేతలి అభ్యర్థి కోట

Tanuku: తణుకు మండలం తేతలిలో స్వతంత్ర సర్పంచి అభ్యర్థి కోట నాగేశ్వరావు ఇంటింటి ప్రచారం; గత అభివృద్ధి, ట్రస్ట్ సేవల ఆధారంగా ఓట్లు అభ్యర్థన.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 23 Nov 2026 9:14 PM IST
Tanuku
X

Tanuku: అభివృద్ధిని చూసి ఓటు వేయండి తేతలి అభ్యర్థి కోట

తణుకు: సమాజమే దేవాలయం తేతలి ప్రజలే నా దేవుళ్ళు గ్రామ ప్రజల ఆశయం మేరకు పెద్దల అశీసులతో తాను స్వతంత్ర అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సర్పంచి అభ్యర్థి కోట నాగేశ్వరావు అన్నారు. తణుకు మండలం తేతలిలో సోమవారం ఆయన ఇంటింటీకి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.తాను గతంలో సర్పంచిగా పని చేసిన కాలంలో గ్రామాన్ని స్వంత నిధులతో అభివృద్ధి చేశానని తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అన్ని సామజిక వర్గాల వారికి సామాజిక భవనాలు స్వంత నిధులతో నిర్మించానని పేర్కొన్నారు. గ్రామంలో ఎవరు మృతి చెందిన కోట రాఘవమ్మ ట్రస్ట్ ద్వారా బస్తా బియ్యంతో పాటు రూ. 5 వేలు నగదు,అంత్య క్రియలకు పుల్లలు ఉ చితంగా అందిస్తున్నానని తెలిపారు. తాను గతంలో సర్పంచిగా పనిచేసినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నానని ఇదే స్ఫూర్తితో ప్రజల వద్దకు వెళ్లుతుంటే నీరాజనాలు పలికి హారతిలిస్తున్నారని తెలిపారు.

ప్రచారానికి వెళుతుంటే గ్రామ ప్రజలు ఆదరిస్తున్న తీరు తనకు ఎంతో సంతోషం ఇస్తుందని చెప్పారు. వారి కుటుంబంలో ఒక సభ్యుడుగా తనను హక్కున చేర్చుకుంటున్నారని గ్రామ ప్రజల ఆశీస్సులతో తాను తేతలి సర్పంచిగా విజయం సాధించి తీరుతానని కోట నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి గ్రామ ప్రజలు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)