Tanuku: తణుకులో ఘనంగా డీటీసీవై ఏకాత్మ బృందం సేవకుల కూడిక!

Tanuku: తణుకు టౌన్ లూదరన్ చర్చిలో డీటీసీవై ఏకాత్మ బృందం ఆధ్వర్యంలో సేవకుల కూడికను ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు పలువురు ప్రముఖ పాస్టర్లు హాజరయ్యారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 30 Sept 2026 6:21 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో ఘనంగా డీటీసీవై ఏకాత్మ బృందం సేవకుల కూడిక!

Tanuku: తణుకు డీటీసీవై ఏకాత్మ బృందం ఆధ్వర్యంలో సేవకుల కూడికను తణుకు టౌన్ లూదరన్ చర్చిలో బుధవారం రెవ కాకర్ల పండన్న అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రొపెసర్ కొడాలి విజయ్కుమార్ ప్రసంగిస్తూ సేవకుల క్రమము,క్రైస్తవ సమాజం పరిపూర్ణమగుటకు ఎలా సిద్ధాపడాలి, పాత నిబందన గ్రంధంలో వాక్యాలను చూపిస్తూ సేవకులకు అందరికి అర్దవంతమైన వాక్య సందేశం చేసి బలపరిచారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు బిషప్ ప్రతాప్ సిన్హా ప్రస్తుత పరిస్థితిల్లో సేవకులు సమాయొచ్చితo గా దేవుని పనిలో ఉండాలని తెలిపారు.

ఈ సందర్బంగా ప్రేమ్ కుమార్, హరేత్ బాబు, జగ్గజీవన్, జేమ్స్, రూబెన్, స్థాన్లీ, ఆశీష్, లివింగ్ స్టన్, బ్రదర్ ప్రవీణ్, అర్జున్ లు పాస్టర్స్ ల్లో ఐక్యత గురించి వివరించారు. కార్యక్రమంలో తణుకు పాస్టర్స్ పెలోషిప్ టీ యూపీఫ్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్, యూసీఏ ప్రెసిడెంట్ దానియేలు, టీమ్ ప్రెసిడెంట్ ప్రసాద్, యూపీఎఫ్ అత్తిలి, ఇరగవరం,పెరవలి, పెనుగొండ, పెనుమంట్ర అధ్యక్షులు గ్లోరీ, ఏసు,నవీన్ కుమార్,చిరంజీవి, క్రీస్తుదాసు,అధిక సంఖ్యలో పాస్టర్స్ పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)