Tanuku: ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీకి అరుదైన శస్త్రచికిత్స
Tanuku: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గర్భిణీకి అరుదైన శస్త్రచికిత్స. అండాశయ నాళ గర్భ సమస్యను తొలగించి ప్రాణాపాయం తప్పించిన వైద్యులు.
Tanuku: ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీకి అరుదైన శస్త్రచికిత్స
తణుకు: తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యులు శనివారం గర్భిణీకి అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. అత్తిలి గ్రామానికి చెందిన బంగారు ధనలక్ష్మి విపరీతమైన కడుపు నొప్పితో ఈ నెల 19న ఆస్పత్రిలో చేరారు. అనంతరం ప్రసూతి వైద్య నిపుణురాలు కె.గాయత్రి, మత్తు వైద్యుడు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో గర్భిణీకి వైద్య పరీక్షలు నిర్వహించారు.
రోగికి గర్భశయం వెలుపల అండాశయ నాళంలో వచ్ఛే గర్భం రావడంతో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిటెడెంట్ డాక్టర్ సాయికిరణ్, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు.




