Tanuku: అర్నాబ్ తుఫాన్ బీభత్సం – చీకటిలో గ్రామాలు, నేలమట్టమైన పంటలు!

Tanuku: తణుకులో అర్నాబ్ తుఫాన్ బీభత్సం. చెట్లు, హోర్డింగ్స్ కూలి రాకపోకలకు విఘాతం, నిలిచిన విద్యుత్, వరి పంట తీవ్ర నష్టం. అధికారులు ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 28 Oct 2026 6:20 PM IST
Tanuku
X

Tanuku: అర్నాబ్ తుఫాన్ బీభత్సం – చీకటిలో గ్రామాలు, నేలమట్టమైన పంటలు!

తణుకు: అర్నబ్ తుఫాను ప్రభావంతో తణుకు నియోజవర్గంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించడంతో ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు కులాయి. దీంతో కొన్ని ప్రధాన రహదారుల్లో రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ప్రధానంగా తణుకు నుంచి ఇగవరం వెళ్లే రోడ్డు, తణుకు నుంచి అత్తిలి వెళ్లే రోడ్డు, వేల్పూర్ రోడ్డు, కొమరవరం రోడ్డు, ఇరగవరం కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో వృక్షాలు కూలడంతో స్థానికులు ప్రయాణికులు పడిన అవస్థలు అన్నీ కావు. తణుకు తాసిల్దార్ కార్యాలయంపై భారీ వృక్షం పడడంతో భవనం స్వల్పంగా దెబ్బతింది.

అయితే తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో ప్రాణాల నష్టం తప్పిందని కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తణుకు పట్టణంలో బీభత్సమైన ఈదురు గాలులకు భారీ హోర్డింగులు సైతం కుప్పకూలయి. ప్రైవేట్ ఆస్పత్రి మూడంతస్తుల భవనం పైనుంచి హోర్డింగ్ కూలి ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బలమైన ఈదురు గాలులతో విద్యుత్ పరివర్తకాలపై చెట్ల కొమ్మలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

దీంతో ఆయా గ్రామాలు మంగళవారం రాత్రి నుంచి చీకటి అంధకారంలో ఉన్నాయి. తాగునీటి సరఫరా సైతం నిలిచిపోవడంతో గ్రామస్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజవర్గంలో చేతుకొచ్చిన వరి పంట పొలాల సైతం నేలమట్టమవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)