Tanuku: మతాలపై నిర్మించే రాజ్యాలు శాశ్వతం కాదు
Tanuku: తణుకులో సీపీఎం శిక్షణా తరగతులు. మతాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు బుద్ధి చెబుతారన్న సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఏ. రవి.
Tanuku: మతాలపై నిర్మించే రాజ్యాలు శాశ్వతం కాదు
తణుకు: మతాలపై నిర్మించే రాజ్యాలు శాశ్వతం కాదని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఏ .రవి అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల భవనంలో పార్టీ సభ్యులకు శుక్రవారం శిక్షణా తరగతులను నిర్వహించారు .ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ నేడు దేశంలో బిజెపి ప్రజల్లో మతాల పేరుతో చిచ్చు పెడుతూ మత ఘర్షణకు కారణం అవుతుందన్నారు.దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఇది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయని పెట్టుబడి దారులకు లాభాలు చేకూరుస్తూ రాజకీయ లబ్ధిని బిజెపి పార్టీ పొందుతుందని అన్నారు. ఓటరల జాబితా సవరణ పేరుతో దేశంలో 20 కోట్ల ఓట్లను తొలగించారని ఈ రాష్ట్రంలో 45 లక్షల ఓట్లను తొలగించారని తెలిపారు.
గతంలో ఓటు వేసి నాయకుడిని ఎన్నుకునేవారని ఇప్పుడు నాయకుడే తనకు ఓటును వేసే ఓటర్ ని ఎన్నుకుంటున్నాడని అదేవిధంగా డబ్బులు పంపకాల కూడా ఆర్థికంగా తగ్గించడం కోసం సవరణ చేస్తున్నారని అన్నారు. ఓట్లు తొలగించినవి అన్నీ కూడా వలస కార్మికులు, పేద ప్రజలు, చదువు సంధ్యలు లేని వారి ఓట్లే తొలగించడం జరిగిందని అన్నారు , రాబోయే కాలంలో ఓట్లు లేని వారికి సంక్షేమ పథకాలను రద్దు చేసే అవకాశం కూడా ఉంటుందని దీనిని పశ్చిమబెంగాల్లో బిజెపి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.
ప్రజలందరూ కేంద్రము చేసే దుర్మార్గంగా చర్యలను గమనిస్తూ ఉన్నారని దానికి వత్తాసు పలుకుతున్న కూటమి ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ప్రజలకు బుద్ధి చెప్తారని రవి అన్నారు .ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ తణుకు పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయ్ కుమారి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బల్ల చిన్న వీరభద్రం సిపిఎం పార్టీ ఇరగవరం మండల కన్వీనర్ కామన మునిస్వామి పాల్గొన్నారు.




