Tanuku: వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ సీఐ వెంకటరమణ
Tanuku: తణుకులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఐ వెంకటరమణ. డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు పాటించాలని హెచ్చరిక.
Tanuku: వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ సీఐ వెంకటరమణ
తణుకు: వినాయక నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని మండపాల నిర్వాహకులకు తణుకు టౌన్ సీఐ జె.వెంకటరమణ సూచించారు. తణుకు పట్టణంలో వినాయక నిమజ్జనం జరిగే ప్రదేశాలను పోలీస్, మున్సిపల్ అధికారులు సందర్శించి భద్రతా ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జన ప్రదేశాల్లో తగినంత వెలుతురు, లైటింగ్, బారికేడింగ్ తదితర సేఫ్టీ ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టమన్నారు. తణుకు పట్టణంలో వినాయక నిమజ్జనం కార్యక్రమాలు
మీ అందరి సహకారంతో ప్రశాంత వాతావరణంలో జరగాలని కొరుకుంటున్నాన ని తెలిపారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.నిమజ్జన ఊరేగింపుల్లో అశ్లీల నృత్యాలు, అసభ్యకర ప్రదర్శనలు, మహిళలు, బాలికలను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని వెల్లడించారు. డీజేలు అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి అనుమతి లేదు. శబ్ద కాలుష్య నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, మున్సిపల్ డిఈ కె. ఈశ్వర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.




