Tanuku: మండపాకలో బోడపాటి వీర్రాజు ప్రచారం.. విడివాడ మద్దతు
Tanuku: తణుకు మండలం మండపాక సర్పంచ్ అభ్యర్థి బోడపాటి వీర్రాజు జోరుగా ప్రచారం; విడివాడ రామచంద్రరావు మద్దతుతో వేడెక్కిన రాజకీయం, అభివృద్ధికి హామీ.
Tanuku: మండపాకలో బోడపాటి వీర్రాజు ప్రచారం.. విడివాడ మద్దతు
తణుకు: తణుకు మండలం మండపాక గ్రామ సర్పంచి అభ్యర్థి బోడపాటి వీర్రాజు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వైకాపా తణుకు మండలం అధ్యక్షుడిగా బోడపాటి గత 11 సంవత్సరాల నుంచి పదవీ బాధ్యతలు కొనసాగిస్తున్నారు. గ్రామ పెద్దల ఆశీస్సులతో సర్పంచి అభ్యర్థిగా ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా పనిచేసిన విడివాడ రామచంద్రరావు మద్దతు ప్రకటించడంతో మండపాకలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
బోడపాటి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తుంటే ప్రజలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. వార్డు సభ్యులకు, తనకు మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి వీర్రాజు మాట్లాడుతూ పారిశుధ్య మెరుగుదలతో పాటు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.




