Tanuku: న్యాయవాద రక్షణ చట్టం చేయాలి: తణుకు బార్ అసోసియేషన్

Tanuku: న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 5 Oct 2026 3:43 PM IST
Tanuku
X

Tanuku: న్యాయవాద రక్షణ చట్టం చేయాలి: తణుకు బార్ అసోసియేషన్

Tanuku: న్యాయవాది వృత్తి రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టం చేయాలని తణుకు బార్ సోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపు మేరకు తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన దీక్షలు చేపట్టారు.అనంతరం స్థానిక తాసిల్దార్ అశోక్ వర్మ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జిఎన్విసిహెచ్వై ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 45 వేల మంది న్యాయవాదులు స్వతంత్రంగా వృత్తిని చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు .న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం వల్ల నేడు న్యాయవాదులపై దాడులు, హత్యలు పెరిగాయని అన్నారు.

ఇప్పటికే తెలంగాణ ,కర్ణాటక రాష్ట్రాల్లో న్యాయవాది వృత్తి కి రక్షణ చట్టాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసి అమలు చేస్తున్నారని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు చట్టం చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ఈనెల ఐదు నుంచి తొమ్మిదో తేదీ వరకు విధులను బహిష్కరిస్తున్నట్లు తరువాత భవిష్యత్తు కార్య చరణ చేపడుతామని వెల్లడించారు . కార్యక్రమానికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మద్దతు తెలిపింది.

కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వెలిచెటి గోవిందరావు, నండూరి రామ్మోహన్రావు, జి .అంబేద్కర్, కౌరు వెంకటేశ్వర్లు, పోట్ల సురేష్, కలిదిండి పద్మావతి, చోడే గోపికృష్ణ, కొండూరి వెంకటేశ్వర్లు, రెంటాల వెంకటేశ్వరరావు, కామన మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)