Narsapuram: నరసాపురంలో ఘనంగా విద్యార్థుల యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ!
Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ.. విద్యార్థులకు సూచనలు చేసిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్.
Narsapuram: నరసాపురంలో ఘనంగా విద్యార్థుల యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ!
Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీఎస్‌యూ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని విద్యార్థులతో కలిసి మత్తు పదార్థాల వ్యతిరేక నినాదాలు చేశారు. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వద్దు కలం ముద్దు అంటూ విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనారోగ్య, సామాజిక దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నరసాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు, విద్యాసంస్థల నిర్వాహకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




